ఖరీఫ్ ధాన్యాన్ని అప్పగించేందుకు గోదాంలో స్థలం కేటాయించాలి

గత ఖరీఫ్ కు సంబంధించి పెండింగ్ లో ఉన్న ధాన్యాన్ని భారత ఆహార సంస్థ కు అప్పగించేందుకు గాను గోదాములలో స్థలం కేటాయించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఎఫ్సీఐ జనరల్ మేనేజర్ రాజు ను కోరారు.

Update: 2024-01-22 13:14 GMT

దిశ, కామారెడ్డి : గత ఖరీఫ్ కు సంబంధించి పెండింగ్ లో ఉన్న ధాన్యాన్ని భారత ఆహార సంస్థ కు అప్పగించేందుకు గాను గోదాములలో స్థలం కేటాయించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఎఫ్సీఐ జనరల్ మేనేజర్ రాజు ను కోరారు. సోమవారం కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో భారత ఆహార సంస్థ జనరల్ మేనేజర్ రాజు మాట్లాడుతూ సీఎంఆర్ జాప్యం పై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నందున జిల్లాలో ధాన్యం పెండింగ్ ఉన్న రైస్ మిల్లులు ఈ నెలాఖరులోగా తమకు కేటాయించిన లక్ష్యం మేరకు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...

    24 గంటలు మిల్లులను నడపాలని, లక్ష్యాలను సాధించిన మిల్లర్లను సమన్వయం చేసుకుంటూ వారి సహకారంతో టార్గెట్ పూర్తి చేయాలని ఆదేశించామని, రోజూ పలు రైస్ మిల్లలను ఆకస్మిక తనిఖీ చేస్తూ వేగవంతం చేస్తున్నామన్నారు. కాగా ఎఫ్సీఐ లో ధాన్యం నిల్వకు స్థలం కేటాయించాలని, అదే విధంగా రవాణాకు అధికంగా వ్యాగన్ లను కేటాయించాలని కోరగా రాజు సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్ర మోహన్, ఎఫ్సీఐ డివిజనల్ మేనేజర్ ప్రకాష్ వర్మ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మేనేజర్ శేఖర్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ అభిషేక్ సింగ్, జిల్లా ఫౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు తదితరులు పాల్గొన్నారు.


Similar News