Alisagar Pump House : అలీసాగర్ పంపు హౌస్ లో పాముల కలకలం..

అలీసాగర్ ఎత్తిపోతల పంప్ హౌస్ లో 20 కి పైగా పాములు కార్మికులను ఆందోళనకు గురి చేశాయి.

Update: 2024-07-18 15:40 GMT

దిశ, నవీపేట్ : అలీసాగర్ ఎత్తిపోతల పంప్ హౌస్ లో 20 కి పైగా పాములు కార్మికులను ఆందోళనకు గురి చేశాయి. మండలంలోని కోస్లీ గోదావరి ఒడ్డున గల అలీసాగర్ లిఫ్ట్ పంపు హౌస్ లోకి గురువారం పెద్ద కొండచిలువ పాముతో పాటు 20కి పైగా పాముపిల్లలు కనపడటంతో అప్రమత్తమైన సిబ్బంది వాటిని చంపివేశారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో పెరిగిన వరద నీటిలో పాములు వచ్చి ఉండొచ్చని కార్మికులు భావిస్తున్నారు.

Tags:    

Similar News