సౌత్ క్యాంపస్ లో పాము కలకలం

బాత్రూంలో నక్కిన తాడి జెర్రీ పాము కలకలం సృష్టించిన ఘటన శుక్రవారం భిక్కనూరు సౌత్ క్యాంపస్ లో చోటుచేసుకుంది.

Update: 2024-07-12 15:18 GMT

దిశ, భిక్కనూరు: బాత్రూంలో నక్కిన తాడి జెర్రీ పాము కలకలం సృష్టించిన ఘటన శుక్రవారం భిక్కనూరు సౌత్ క్యాంపస్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... క్యాంపస్ ఆవరణలోని సోషల్ వర్క్ విభాగంలోని దివ్యాంగుల బాత్రూంలో తాడి జెర్రీ పాము కనబడింది. దీంతో భయభ్రాంతులకు గురైన క్యాంపస్ విద్యార్థులు జంగంపల్లి గ్రామంలో ఉండే పర్యావరణ పరిరక్షకుడు మోహన్ రెడ్డి కి సమాచారం అందించగా ఆయన వెంటనే క్యాంపస్ కు చేరుకున్నాడు. ఆ భారీ పామును చంపకుండా, చాకచక్యంగా పట్టుకున్నాడు. పామును చేతులతో పట్టుకొని ఆడుతుండడంతో విద్యార్థులు ఒక్కసారిగా విస్మయం వ్యక్తం చేశారు. పాము కనబడగానే చంపవద్దని పామును ఏ విధంగా పట్టుకున్నానో అన్న విషయమై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం పట్టుకున్న పామును బాక్సులో భద్రపరిచే ప్రయత్నం చేసినప్పటికీ అది పట్టకపోవడంతో చేసేదేమీ లేక గోనెసంచిలో పట్టుకెళ్లాడు.


Similar News