సిరికొండలో అత్యధిక వర్షపాతం నమోదు
నిజామాబాద్ జిల్లాలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 80.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 21 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, 12 మండలాల్లో సాధారణ వర్ష కురిసింది. సిరికొండ మండలంలో అత్యధిక వర్షపాతం 172.1 మిమీలుగా నమోదు కాగా, డొంకేశ్వర్ లో అత్యల్ప వర్షపాతం 30.0 మిమీలు నమోదైనట్లు జిల్లా వాతావరణ శాఖ తెలిపింది.
జిల్లాలోని ఇతర మండలాల్లో నమోదైన వర్షపాతాలను పరిశీలిస్తే.. ముప్కాల్ లో 130, మెండోరలో 122.2, ఎర్గట్లలో 115.1, మోర్తాడ్ లో 108.9, ముగ్ పాల్ లో 103.2, నవీపేట్ లో 100.0, బాల్కొండలో 99.9, ఇందల్వాయి లో 96.4, వేల్పూర్ లో 94.1, ఆర్మూర్ లో 90.5, కమ్మర్ పల్లిలో 86.3, ధర్పల్లిలో 85.0, మోస్రా లో 81.6, జక్రాన్ పల్లిలో 79.8, భీంగల్ లో 78.4, డొంకేశ్వర్ లో 77.4, చందూరులో 74.6, ఆలూరులో 72.7, మాక్లూర్ లో 71.0, నిజామాబాద్ సౌత్ లో 70.8, ఎడపల్లిలో 69.8, వర్నిలో 64.8, నిజామాబాద్ రూరల్ లో 63.2, నిజామాబాద్ నార్త్ లో 59.9, నందిపేట్ లో 56.9, రెంజల్ లో 55.8, పోతంగల్ లో 51.3, రుద్రూర్ లో 63.4, కోటగిరిలో 49.9, బోధన్ లో 47.3, సాలూరలో 38.0మిమీల వర్షపాతం నమోదైనట్లు జిల్లా వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.