ఎన్నికల శిక్షణకు డుమ్మా కొట్టిన ఉపాధ్యాయులకు షాక్

నిజామాబాద్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల కోసం నిర్వహించిన శిక్షణకు డుమ్మా కొట్టిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిజామాబాద్ డీఈఓ కు షాక్ ఇచ్చారు.

Update: 2024-04-03 13:47 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల కోసం నిర్వహించిన శిక్షణకు డుమ్మా కొట్టిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిజామాబాద్ డీఈఓ కు షాక్ ఇచ్చారు. ఈనెల 1 ,2 తేదీల్లో జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి జిల్లాలోని 84 మంది ఉపాధ్యాయులు డుమ్మా కొట్టారు. అందులో గెజిటెడ్ హెడ్మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు ఉండడంతో వారికి ఎన్నికల విధులకు గైర్హాజరైన కారణాన్ని తెలపాలని తాకీదులు జారీ చేశారు. ఈనెల 4 లోపు సంజాయిషీ ఇవ్వాలని, లేకపోతే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. 


Similar News