కీచక టీచర్ రిమాండ్

విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుని గురువారం సాయంత్రం రిమాండ్ చేసినట్లు ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు.

Update: 2024-04-04 13:41 GMT

దిశ, లింగంపేట్ : విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుని గురువారం సాయంత్రం రిమాండ్ చేసినట్లు ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు శ్రీనివాస్ శర్మ విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు విద్యార్థులు షీ టీం సభ్యుల దృష్టికి తీసుకురాగా వారి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి కీచక టీచర్ ను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. 


Similar News