ఆర్మూర్లో సప్త హారతి గిరి ప్రదక్షిణ

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల ప్రసిద్ధిగాంచిన నవనాథ సిద్దుల గుట్ట ఆలయం చుట్టూరా సప్త హారతి గిరి ప్రదక్షిణ సోమవారం రాత్రి అత్యంత వైభవంగా ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు.

Update: 2023-12-11 15:52 GMT

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల ప్రసిద్ధిగాంచిన నవనాథ సిద్దుల గుట్ట ఆలయం చుట్టూరా సప్త హారతి గిరి ప్రదక్షిణ సోమవారం రాత్రి అత్యంత వైభవంగా ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. సిద్దులగుట్ట సప్త హారతి గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్దులగుట్ట ఘాట్ రోడ్ నుండి ప్రారంభమైన సప్త హారతి గిరి ప్రదక్షిణ కార్యక్రమం

    ఆలూరు రోడ్డు, కాశీ హనుమాన్, పెద్ద బజార్, జెండా మందిరం, ప్యాట్ల హనుమాన్, గోల్ బంగ్లా, పాత బస్టాండ్, జంబి హనుమాన్, అంబేద్కర్ చౌరస్తాల మీదుగా అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ సభ్యులు సప్త హారతి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మూర్ మున్సిపల్ తో పాటు, మండలంలోని పలు గ్రామాల ప్రజలు సిద్దుల గుట్ట సప్త హారతి గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి అశేషంగా హాజరై స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో నవనాథ సిద్దుల గుట్ట ఆలయ కమిటీ సభ్యులు, ఆర్మూర్ మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, ఆర్మూర్ నియోజకవర్గంలోని బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. 


Similar News