sandalwood tree : ఏండ్రియల్ గ్రామంలో గంధపు చెట్టు చోరీ ..

గంధపుచెట్టును గుర్తు తెలియని దుండగులు చోరీ చేసిన ఘటన మండలంలోని ఏండ్రియల్ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Update: 2024-07-31 09:53 GMT

దిశ, తాడ్వాయి : గంధపుచెట్టును గుర్తు తెలియని దుండగులు చోరీ చేసిన ఘటన మండలంలోని ఏండ్రియల్ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, గ్రామ పంచాయతీ సిబ్బంది తెలిపిన వివరాల మేరకు ఏండ్రియల్ గ్రామంలోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో గత కొన్ని సంవత్సరాల క్రితం నుంచి గంధపు చెట్టు పాఠశాల ప్రాంగణంలో ఉందని అన్నారు.

అ గంధం చెట్టు ఏపుగా పెరగడంతో దాని పై కన్నేసిన దుండగులు సోమవారం రాత్రి పక్కా ప్రణాళికతో గుట్టుచప్పుడు కాకుండా గంధపు చెట్టు దుంపలను నరికి ఎత్తుకెళ్లారు. దీంతో ఈ దొంగతనం ఇంటి దొంగల పనా లేక మరెవరైంటారో అని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దొంగతనం ఒకరితో అయ్యే పని కాదని గ్రామస్థులు భావిస్తున్నారు. ఇదే విషయమైన ఎస్సై వెంకటేశ్వర్ ను సంప్రదించగా ఫిర్యాదు రాలేదు. ఫిర్యాదు వచ్చిన వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని అన్నారు.

Tags:    

Similar News