అధికారులను భయపెడుతూ ఎమ్మెల్యే షకీల్ ఇసుక దందా : వైఎస్ఆర్టీపీ కో-ఆర్డినేటర్ నింబూరి సత్యవతి

ప్రజా సమస్యలను గాలికొదిలి ఎమ్మెల్యే షకీల్ అధికారులను భయపెడుతూ అక్రమంగా ఇసుక దందాను నిర్వహిస్తున్నాడని వైఎస్ఆర్టీపీ కో-ఆర్డినేటర్ నింబూరి సత్యవతి అరోపించారు.

Update: 2023-05-31 15:58 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ప్రజా సమస్యలను గాలికొదిలి ఎమ్మెల్యే షకీల్ అధికారులను భయపెడుతూ అక్రమంగా ఇసుక దందాను నిర్వహిస్తున్నాడని వైఎస్ఆర్టీపీ కో-ఆర్డినేటర్ నింబూరి సత్యవతి అరోపించారు. బుధవారం బోధన్ లో విలేరుల సమావేశంలో సత్యవతి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే షకీల్ అనుచరులు మంజీర ఇసుక రవాణా చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

ప్రజా అవసరాల నిమిత్తం ఉపయోగించాల్సిన ఇసుకను అక్రమంగా అమ్ముకోవడం, నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రశ్నించిన ప్రభుత్వ అధికారులను బెదిరించడం సిగ్గుచేటన్నారు. రాత్రీ, పగలు అనే తేడా లేకుండా వందలాది ఇసుక బండ్లను నడపడం మూలంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆమె అవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు ధాన్యం కొనుగోలులో జాప్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆమె వాపోయారు. ఈ సమస్యను పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే .. యాక్సిడెంట్ చేసిన భార్యను ఎలా కాపాడుకోవాలి..అడ్డదారులు తొక్కుతూ డబ్బు ఎలా సంపాదించాలని ఆలోచించడం సరికాదన్నారు.

ప్రజాస్వామ్యంలో పదవులు ఎవరికి శాశ్వతం కాదని.. ప్రజాగ్రహం ముందు ఎమ్మెల్యే పదవి త్వరలోనే ఊడుతుందని అమే హెచ్చరించారు. తక్షణమే అధికారులు.. స్పందించి ఎమ్మెల్యే, అతని అనుచరులు చేస్తున్న అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్టీపీ మండలాధ్యక్షుడు జగన్, పట్టణా ప్రెసిడెంట్ యూనుస్, నాయకులు షాహనవాజ్, పోచ్చన్న, అశోక్, స్వప్న షాహీన్, సోషల్ మీడియా ఇన్ చార్జి సంగమేశ్వర్ పాల్గొన్నారు.  

Tags:    

Similar News