రూ. 2 లక్షలోపు రెన్యువల్ చేయని పాత రుణాలు కూడా మాఫీ అవుతాయి : రూరల్ ఎమ్మెల్యే

రూ. 2లక్షల లోపు ఉండి, రెన్యూవల్ చేసుకొని పంట రుణాలకు కూడా రుణ మాఫీ వర్తిస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు.

Update: 2024-07-16 09:48 GMT

దిశ, నిజామాబాద్ ప్రతినిధి : రూ. 2లక్షల లోపు ఉండి, రెన్యూవల్ చేసుకొని పంట రుణాలకు కూడా రుణ మాఫీ వర్తిస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. నిజామాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు తీసుకున్న పంట రుణాలను ఏక కాలంలో తీర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ. లక్ష రుణ మాఫీ చేస్తే, ఇప్పడు రేవంత్ రెడ్డి హయాంలో రెండు లక్షల రుణ మాఫీ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రైతు రుణ మాఫీ చేశారా అని భూపతి రెడ్డి ప్రశ్నించారు.

గత బీ ఆర్ ఎస్ ప్రభుత్వం రూ. లక్ష రుణ మాఫీనే సరిగా చేయలేదని, విడతల వారీగా చేస్తే, రైతులు వడ్డీలు కట్టెందుకే సరిపోలేదని ఆయనన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీలు నెరవేరుతున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రతి రోజు 45 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారని, దీంతో ఆర్టీసీ లాభాల బాట పట్టిందన్నారు. వరి వేస్తే ఉరే అని కేసీఆర్ రైతులను ఆగం చేస్తే సన్న బియ్యం దిగుబడిని పెంచేందుకు సీఎం రూ. 500 లు బోనస్ గా ఇచ్చేందుకు ముందుకొచ్చారన్నారు. రైతులకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ఇస్తూ రైతుల అభివృద్ధికి పాటు పడుతున్న విషయాన్ని బీ ఆర్ ఎస్, బీజేపీ లు గుర్తించాలన్నారు. ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీ ఆర్ ఎస్, బీజేపీ లు కుమ్మక్కయ్యాయని ఎమ్మెల్యే అన్నారు.

దేశంలో ప్రభుత్వాలను కూలదోసిన చరిత్ర ఉన్న బీజేపీ చరిత్ర మరిచిపోయి మాట్లాడటం సరికాదన్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకోడానికి మాతో కలుస్తానన్న వారిని కచ్చితంగా మా పార్టీలో కలుపుకుంటామని స్పష్టం చేశారు. రుణమాఫీకి షరతులు ఉంటాయన్నారు. వందల ఎకరాలున్న మల్లారెడ్డి, కేసీఆర్, కేటీఆర్ లాంటి నాయకులు బడా భూస్వాములకు వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తే మీకు సంతృప్తి కలుగుతుందా అని రుణ మాఫీకి షరతులు ఎందుకని ప్రశ్నిస్తున్న బీజేపీ నాయకులను ఎమ్మెల్యే భూపతి రెడ్డి తిరిగి ప్రశ్నించారు.

కేసీఆర్ మాట్లాడే మాటలకు హద్దు పద్దు లేదనన్నారు. ఫోన్ ట్యాపింగ్, ధరణిలో, ప్రాజెక్టుల్లో అక్రమాలతో రాష్ట్రాన్ని కేసీఆర్ సర్వనాశనం చేశాడని భూపతి రెడ్డి అన్నారు. ధరణి పేరుతో కోట్లాది రూపాయల విలువైన భూముల్ని అమ్ముకున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. రైతు బంధు 26 వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయని ఆయన ఆరోపించారు. మల్లారెడ్డి లాంటి ప్రయోజనం కోసం రోడ్ల పక్కన వేసే వెంచర్ల భూములకు కూడా రైతు బంధు పేరుతో వేల కోట్లు దుర్వినియోగం చేసిన ఘనత కేసీఆర్ దని ఎమ్మెల్యే అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ లు కుమ్మక్కయింది వాస్తవం కాదని చెప్పగలరా అని ఇరు పార్టీల నాయకులను ఆయన ప్రశ్నించారు.

పదేళ్లలో కేసీఆర్ ఉద్యోగాలిస్తే

తెలంగాణ ఏర్పడక మునుపు లక్ష మంది నిరుద్యోగులుంటే ఇప్పుడు 2లక్షలకు ఎందుకు పెరిగారన్నారు. ప్రాజెక్టులు కట్టి సాగు నీరిస్తే 18లక్షలున్న బోరు బావుల సంఖ్య 30 లక్షలకు ఎందుకు పెరిగిందో కేసీఆర్ చెప్పాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.


Similar News