రేవంత్ రెడ్డి ముమ్మాటికీ యూట్యూబ్ ముఖ్యమంత్రే

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట మీద నిలబడే వ్యక్తి కాదని, ఆయన ముమ్మాటికీ యూట్యూబ్ ముఖ్యమంత్రి అని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి విమర్శించారు.

Update: 2024-03-27 14:45 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట మీద నిలబడే వ్యక్తి కాదని, ఆయన ముమ్మాటికీ యూట్యూబ్ ముఖ్యమంత్రి అని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని, కాంగ్రెస్ పరిపాలన వంద రోజులు అయ్యేదాకా ప్రశ్నించ కూడదని ఇన్ని రోజులు ఆగామని, ఇప్పుడు ప్రశ్నించక తప్పడం లేదన్నారు. బుధవారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జీవన్ రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ మాజీ మంత్రి, బోదన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ లు కేసులు పెడుతామని బెదిరిస్తున్నారని వారి బేదిరింపులకు భయపడేది లేదని అన్నారు. అవినీతికి, స్కామ్ లకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని, వారి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు.

    కాంగ్రెస్ పార్టీలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఒక కోటరీ అయితే రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక కోటరీ అని అన్నారు. రాష్ట్రానికి ప్రధాని మోడీ వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోడీని ఉద్దేశిస్తూ బడే బాయి అన్నారని అంటే సీఎం రేవంత్ రెడ్డి చోటాబాయి అన్నట్లు అర్థమవుతుందన్నారు. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిమాట మీద నిలబడే వ్యక్తి కాదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అరాచకాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ సమయంలో కేసీఆర్ కేసులు పెట్టి ఉంటే సుదర్శన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ స్వేచ్ఛగా తిరిగే వారా అని ప్రశ్నించారు. సుదర్శన్ రెడ్డి ముమ్మాటికీ లిక్కర్ మీద బతుకుతున్నారని ఆరోపించారు. గోడకు బంతిని కొడితే తిరిగి తన వైపే వస్తుందని గుర్తుంచుకోవాలన్నారు. అలాగే ముఖ్యమంత్రి మూడు

    నెలల్లో 5000 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో కళ్యాణ లక్ష్మి అందించామని కానీ కాంగ్రెస్ హయాంలో ప్రజలకు తులం బంగారం కూడా ఇవ్వడం లేదన్నారు. మహిళా శక్తి ద్వారా మహిళలకు 2500 రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చి మరిచారన్నారు. ఆర్మూర్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వినయ్ కుమార్ బ్రోకర్ గా బీఆర్ఎస్ సాయంలో మంజూరైన కళ్యాణ్ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇప్పటివరకు ఇవ్వడం లేదన్నారు. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కడ అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవిత నిర్దోషిగా బయటకు వస్తుందని అన్నారు. వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు ఖాయం అన్నారు.

Tags:    

Similar News