ఇంటర్​ పరీక్ష ఫీజు చెల్లించేందుకు షెడ్యూల్​ రిలీజ్ - చివరి తేదీ ఇదే..

2024-25 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థుల వార్షిక పరీక్షల ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు ప్రకటించిందని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపూడి రవికుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు .

Update: 2024-11-06 15:17 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ నవంబర్ 06: 2024-25 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థుల వార్షిక పరీక్షల ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు ప్రకటించిందని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపూడి రవికుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు . ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థులు.. ఈ నెల 26వ తేదీ వరకు పరీక్షల ఫీజులు చెల్లించుకోవచ్చని జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ తెలిపారు. రాష్ట్ర ఇంటర్ బోర్డు పరీక్షల విభాగం నిర్ణయం మేరకు..ఆయా గ్రూపుల విద్యార్థుల పరీక్ష ఫీజులను ఆన్ లైన్ లో నిక్షిప్తం చేయడం జరిగిందన్నారు. ఆ మేరకు విద్యార్థులు ఫీజులను ఆయా కళాశాలాల్లో2024-25 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థుల వార్షిక పరీక్షల ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు ప్రకటించిందని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపూడి రవికుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు . ప్రిన్సిపాల్‌ ద్వారా చెల్లించుకోవచ్చని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, గురుకుల, కేజీబీవీ, ఇతర అన్ని రకాల రెసిడెన్షియల్ విద్యార్థులు ఇంటర్ వార్షిక పరీక్ష ఫీజులను ఈ నెల 26 వ తేదీ లోపల ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించుకోవచ్చని ఆయన తెలిపారు. రూ.100 అపరాధ రుసుము మొదలుకుని, రూ.2 వేల రూపాయల అపరాధ రుసుముతో డిసెంబర్ 27వ తేదీ వరకు చెల్లించవచ్చని అధికారి పేర్కొన్నారు. ఇంటర్ బోర్డు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం వార్షిక పరీక్షకు ఒకేషనల్ విద్యార్థులకు రూ. 750 లు, ఆర్ట్స్ కోర్సులకు రూ. 520 లు, సైన్స్ విద్యార్థులకు రూ. 750 ల చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు. మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయిన సప్లిమెంటరీ విద్యార్థులు అదనంగా మరో రూ. 520 లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. మొదటి సంవత్సరం ప్రాక్టికల్ ఫెయిలైన వారు మరో రూ. 250 లు చెల్లించాల్సి ఉంటుందని జిల్లా ఇంటర్ విద్య అధికారి తెలిపారు.


Similar News