కామారెడ్డిలో నిలిచిపోయిన భూముల రిజిస్ట్రేషన్లు

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో గత పది రోజులుగా భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.

Update: 2023-12-11 09:41 GMT

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో గత పది రోజులుగా భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో రిజిస్ట్రేషన్ కోసం స్లాట్లు బుక్ చేసిన రైతులు కార్యాలయం చుట్టూ తిరుగుతూ వెనుదిరిగి పోతున్నారు. కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేయాల్సిన అధికారి డిజిటల్ సంతకం కీ రావడం లేదని పేర్కొంటూ 10 రోజులుగా తప్పించుకుంటున్నారని రైతులు ఆరోపించారు. సోమవారం ఉదయం నుంచి హైదరాబాదు నుంచి డిజిటల్ కీ సంతకం వస్తుందని అధికారులు

    పేర్కొనడంతో స్లాట్ బుక్ చేసుకున్న రైతులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేచి ఉన్నారు. మధ్యాహ్నం మూడు గంటలు అయిపోతున్నా అధికారులు రిజిస్ట్రేషన్లు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసి డిప్యూటీ తహసీల్దార్ ను నిలదీశారు. కాగా ఆపరేటర్ అందుబాటులో లేడని, ఆపరేటర్ రాగానే రిజిస్ట్రేషన్లు చేస్తామని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోనే అధికారుల పరిస్థితి ఇలా ఉంటే మారుమూల మండలాల్లో ఎలా ఉంటుందోనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి జిల్లా కేంద్రంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. 


Similar News