కలెక్టర్ కు రేషన్ డీలర్ల సమ్మె నోటీసు
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైనందుకు గాను రేషన్ డీలర్లు జిల్లా కలెక్టర్ కు బుధవారం సమ్మె నోటీసు అందజేశారు.
దిశ, కామారెడ్డి రూరల్ : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైనందుకు గాను రేషన్ డీలర్లు జిల్లా కలెక్టర్ కు బుధవారం సమ్మె నోటీసు అందజేశారు. రేషన్ డీలర్ల జేఏసీ నాయకుల ఆదేశాల పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా నాయకులు జూన్ 5 నుంచి జరగబోయే సమ్మెకు ముందస్తుగా నోటీసులు అందజేసినట్లు తెలిపారు. అదేవిధంగా జాయింట్ కలెక్టర్, సివిల్ సప్లై డీ.ఎస్.వోకు సమ్మె నోటీసు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గౌరిశెట్టి రాజు, ఉపాధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ రావు, మాజీ అధ్యక్షుడు నాగం సురేందర్, వివిధ మండలాల రేషన్ డీలర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
రేషన్ డీలర్ల డిమాండ్లు ఇవే..
గౌరవ వేతనం, దిగుమతి హమాలీ చార్జీలు, కరోన సమయంలో విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన 98 మంది డీలర్లకు ఎక్స్ గ్రేషియా రూ.25 లక్షలు, కారుణ్య నియమాలను వయసుతో సంబంధం లేకుండా భర్తీ చేయాలి. అదేవిధంగా హెల్త్ కార్డులు మంజూరు చేయాలనే డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచారు.