Ration shop : హైటెక్ తరహాలో రేషన్ దందా..

పేద ప్రజలు ఆకలితో ఉండకూడదు అని సదుద్దేశంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ ఉచిత రేషన్ బియ్యం పథకం. కానీ ఈ పథకం కొందరికి రేషన్ డీలర్లకు మాత్రం వరంగా మారుతున్నది.

Update: 2024-07-21 14:24 GMT

దిశ, ఎల్లారెడ్డి : పేద ప్రజలు ఆకలితో ఉండకూడదు అని సదుద్దేశంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ ఉచిత రేషన్ బియ్యం పథకం. కానీ ఈ పథకం కొందరికి రేషన్ డీలర్లకు మాత్రం వరంగా మారుతున్నది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని దుకాణం నెంబర్ 2922021, 2922024 ఈ రెండు దుకాణాలు ఒకే వ్యక్తి నిర్వహిస్తుంటాడు. ప్రతి నెల మూడు లేదా నాలుగు రోజులు మాత్రమే ఇక్కడికి వచ్చి దుకాణం నిర్వహిస్తూ మిగతా రోజుల్లో హైదరాబాదులో ఉంటాడు. హైదరాబాదులో ఉంటూ అక్కడ ఒక ఈ పాస్ మిషన్, వెయింగ్ మిషన్ ఉంటది. వాటి ద్వారా వివిధ జిల్లాల నుంచి వలస వచ్చిన వారికి ట్రాన్సాక్షన్ చేస్తుంటాడు. కానీ వారికి బియ్యం ఇవ్వరు. కేవలం కీలోకు ఏడు రూపాయలు లేదా ఎనిమిది రూపాయలు చెల్లిస్తాడు. ఆ కార్డులకు సంబంధించిన బియ్యం ఇక్కడ బ్లాక్ మార్కెట్లో తరలిస్తాడు.

25 నుంచి 30 రూపాయలకు విక్రయిస్తారు. ఇట్లా ప్రతి నెల సుమారు 30 నుంచి 40 క్వింటాలు బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ తరలిస్తూ లక్షల రూపాయలు వెనకేసుకుంటున్నారు. ఈ వ్యవహారం సుమారు రెండు మూడు సంవత్సరాల నుండి నడిచినప్పటికీ అధికారులు మాత్రం మాకేం పట్టదు అన్నట్టుగా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి దందా ఈ ఒక్క ఎల్లారెడ్డి మండలంలో మాత్రమే జరగడం లేదు. కామారెడ్డి జిల్లాలో ఇంక కొన్ని మండలాల్లో కూడా ఇదే తరహా పల్లెటూరులో డీలర్ గా ఉంటూ హైదరాబాదులో స్థిరపడ్డ వారు ఇదే తరహా వ్యాపారం కొనసాగిస్తున్నారని మాకు సమాచారం ఉన్నది. కావున ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని విచారణ జరిపించి ఇలాంటి డీలర్లను తక్షణమే తొలగించి స్థానికంగా ఉండే వ్యక్తులకు రేషన్ షాప్ లను ఇవ్వాలని అక్రమాలకు పాల్పడిన ఆ రేషన్ డీలర్ల పై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News