నిజామాబాద్ ఏసీపీగా రాజా వెంకటరెడ్డి బాధ్యతల స్వీకరణ

నిజామాబాద్ ఏసీపీగా రాజా వెంకటరెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

Update: 2024-02-16 16:40 GMT

దిశ ప్రతినిధి ,నిజామాబాద్ : నిజామాబాద్ ఏసీపీగా రాజా వెంకటరెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ ఏసీపీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ ఏసీపీగా పనిచేసిన ఎం. కిరణ్ కుమార్ ఇటీవల హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి బదిలీ అయిన విషయం తెలిసిందే. హైదరాబాద్​లో పోస్ట్ కోసం వెయిటింగ్ లో ఉన్న రాజా వెంకటరెడ్డిని నిజామాబాద్ కు పోస్టింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. నిజామాబాద్ ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన రాజా వెంకటరెడ్డి సీపీ కల్మేశ్వర్ తో పాటు ఇతర అధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్త ఏసీపీని నిజామాబాద్ డివిజన్ కు చెందిన సీఐలు, ఎస్సైలు కలిసి స్వాగతం పలికారు.


Similar News