పెర్కిట్ సొసైటీ మహాజన సభలో రచ్చ.. రచ్చ...

ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పెరికిట్ ఏరియాలో గల సొసైటీ ఆవరణలో ఆదివారం జరిగిన రైతు మహాజన సభ రచ్చ రచ్చగా మారింది.

Update: 2024-06-30 16:28 GMT

దిశ ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పెరికిట్ ఏరియాలో గల సొసైటీ ఆవరణలో ఆదివారం జరిగిన రైతు మహాజన సభ రచ్చ రచ్చగా మారింది. మహాజన సభ ప్రారంభంలోనే రైతులు సొసైటీ లో 18 లక్షల అవకతవగలపై సొసైటీ చైర్మన్ పెంట భోజరెడ్డిని నిలదీశారు. సొసైటీలో జరిగిన అవినీతి అవకతవకలు సొసైటీ పాలకవర్గ సభ్యులే చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. సొసైటీలో ఏమీ అవకతవకలు జరగలేదని ఆ డబ్బులు మా సొసైటీ పాలకవర్గం ఎందుకు చెల్లిస్తుందని, చెల్లించమని సొసైటీ పాలకవర్గ సభ్యులు మహాజనసభలో తేల్చి చెప్పారు.

జరిగిన అవకతవకలకు తోడు రైతులకు సరిపడా ఎరువులను సైతం సొసైటీ గోదాంలో ఉంచడం లేదంటూ రైతులు నువ్వా నేనా అంటూ.. సై అంటే సై అనే రీతిలో.. వాడుక భాషలో మాట్లాడడానికి అణువు కానీ మాటలతో ఒకరినొకరు సొసైటీ పాలకవర్గ సభ్యులు రైతులు వాగ్వాదం చేసుకున్నారు. పెర్కిట్ సొసైటీ పరిధిలోని రైతుల , సొసైటీ పాలకవర్గ సభ్యుల మధ్య జరిగిన వాగ్వాదం నువ్వెంత అంటే నువ్వెంత అంటూ.. తారస్థాయికి వెళ్ళింది. పెరికిట్ సొసైటీలో తారాస్థాయికి చేరిన రైతుల సొసైటీ పాలకవర్గ సభ్యుల మధ్య వాగ్వాదంతో సొసైటీ బాగోతం ఆర్మూర్ ప్రాంతంలో తీవ్ర రచ్చకెక్కింది. ఈ కార్యక్రమంలో పెరికిట్ సొసైటీ చైర్మన్ పెంట భోజ రెడ్డి, వ్యవసాయ శాఖ ఏఈఓ నరేష్ ,సొసైటీ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.


Similar News