ఆర్మూర్ కోర్ట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన..

సిద్దిపేట జిల్లా కోర్ట్ న్యాయవాది రవికుమార్ పై జరిగిన దాడిని ఆర్మూర్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు గురువారం తీవ్రంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.

Update: 2024-07-11 11:38 GMT

దిశ, ఆర్మూర్ : సిద్దిపేట జిల్లా కోర్ట్ న్యాయవాది రవికుమార్ పై జరిగిన దాడిని ఆర్మూర్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు గురువారం తీవ్రంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు తెడ్డు నర్సయ్య న్యాయవాది రవికుమార్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. న్యాయవాదుల సంరక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దేవరశెట్టి అరుణ్ కోశాధికారి తుమ్మ సుకేష్ సీనియర్ న్యాయవాదులు తాజుద్దీన్, కృష్ణం రాజు, జగదీష్, శ్రీధర్, అశోక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


Similar News