public voice : ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులకు సూచించారు.

Update: 2024-10-28 09:45 GMT

దిశ, కామారెడ్డి : ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాల్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రజావాణి లో వచ్చే అర్జీలను సంబంధిత అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తుదారులు రుణమాఫీ, భూ సమస్యలు, తదితర సమస్యలపై 64 అర్జీలను స్వీకరించారు. ఇందులో రెవిన్యూ 27, వ్యవసాయ శాఖ 9, పౌరసరఫరాలు 1, విద్యాశాఖ 1, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ 3, జిల్లా పంచాయతీ 10, రోడ్లు భవనాలు 1, విద్యుత్ శాఖ 1, మున్సిపల్ 7, జిల్లా గ్రామీణాభివృద్ధి 1, సర్వే ల్యాండ్ రికార్డు 2, జిల్లా సంక్షేమ అధికారి 1 చొప్పున దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పెండింగ్ లో ఉన్న వాటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని, వాటికి సమాధానాలు ఆయా అర్జీదారునికి తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. గత వారం వరకు 18,360 అర్జీలు రాగా, వాటిని పరిశీలించి 17,752 అర్జీలను ఆయా శాఖల అధికారులు పరిష్కరించారని, 608 పెండింగులో ఉన్నాయని తెలిపారు. ఈ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రంగనాథ్ రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జడ్పీ సి.ఈ. ఒ. చందర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


Similar News