రెండు కొత్త కోర్టులు ప్రారంభం

నిజామాబాద్ నగరంలో కోర్టు కాంప్లెక్స్ లో రెండు కొత్త కోర్టులను జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి తుకారాం ప్రారంభించారు.

Update: 2024-02-17 15:57 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో కోర్టు కాంప్లెక్స్ లో రెండు కొత్త కోర్టులను జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి తుకారాం ప్రారంభించారు. శనివారం అడిషనల్ సీనియర్ సివిల్ కోర్టు అడిషన ల్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు 5 వ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కం 5వ అడిషనల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ రెండు కోర్టులను ప్రారంభించారు. అంతకు ముందు జిల్లా కేంద్రానికి వచ్చిన హైకోర్టు న్యాయమూర్తికి జిల్లా అధికార యంత్రాంగం సాదర స్వాగతం పలికారు. కోర్టు కాంప్లెక్స్ లో రెండు న్యాయస్థానాలను ప్రారంభించిన తుకారం మాట్లాడుతూ జిల్లా లో పెరుగుతున్న సివిల్, క్రిమినల్ కేసులను దృష్టిలో పెట్టుకొని ఈ రెండు కోర్టులను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

     కక్షిదారులకు త్వరితగతిన న్యాయం జరుగు తుందని తెలిపారు. అదే విధంగా న్యాయవాదులకు న్యాయ విజ్ఞానం పెంచుకోవడం పట్ల పలు సూచనలు తెలిపారు. కోర్టు ఉద్యోగులకు ద్వి చక్ర వాహనం నడిపే వారికి ఉచితంగా హెల్మెట్లు అందజేశారు. అనంతరం జిల్లా జడ్జి సునీత కుంచాల, జిల్లాకు రెండు కోర్టు లను ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవదాస్ చందక్, కార్య దర్శి భాగీ చరణ్, ఉపాధ్యక్షుడు ఆశనారాయణ, బార్ సభ్యులు హిట్ కోర్టు, జిల్లా జడ్జి లను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జి ఆశా లత, శ్రీనివాస్, న్యాయ సేవ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పి.పద్మావతి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్ బాబు, జూనియర్ సివిల్ జడ్జి గోపి కృష్ణ, కుష్బూ ఉపాధ్యాయ, పి. శ్రీనివాస్, బార్ సభ్యులు రేంజర్ల సురేష్, బిట్ల రవి, సత్యనారాయణ గౌడ్, న్యాయవాదులు కృపాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Similar News