లీగల్ ఇసుక రవాణాకు నో పర్మిషన్...

నిన్నటి వరకు ఇల్లీగల్ ఇసుక రవాణాకు అడ్డాగా మారిన భీంగల్ మండలంలో లీగల్ ఇసుక రవాణాకు అధికారులు నో పర్మిషన్ అంటున్నారు.

Update: 2024-06-22 10:10 GMT

దిశ, భీంగల్ : నిన్నటి వరకు ఇల్లీగల్ ఇసుక రవాణాకు అడ్డాగా మారిన భీంగల్ మండలంలో లీగల్ ఇసుక రవాణాకు అధికారులు నో పర్మిషన్ అంటున్నారు. మండల కేంద్రంతో పాటు పక్క గ్రామం బడా భీంగల్ లో గవర్నమెంట్ ఇసుక పాయింట్లు ఉండగా ఆయా పట్టణ, గ్రామాల్లో ఇండ్ల నిర్మాణం చేసుకొంటున్న లబ్ధిదారులకు గత నెల రోజులుగా ఇసుకకు అనుమతినివ్వడ్డం లేదని లబ్ధిదారులు అంటున్నారు. అర్ధరాత్రుల్లో దొంగచాటున ఇసుక రవాణా జరిగిన భీంగల్ పట్టణంలో 250 కి పైగా వే బిల్లులు, బడా భీంగల్ లో సుమారు 250 ట్రాక్టర్ల ఇసుక అవసరం మేరకు లబ్ధిదారులు గవర్నమెంట్ కు డీడీలు కట్టి వే బిల్స్ తీసుకొన్నారు. ఒక్క ట్రాక్టర్ కు రూ. 900 చొప్పున డీ.డీ లు కట్టారు. ప్రతి వారం మూడు రోజులు బుధ, శుక్ర, శనివారాల్లో వే బిల్లు కట్టిన ట్రాక్టర్లకు పర్మిషన్ ఇచ్చే క్రమంలో సుమారు నెల రోజులుగా తహసీల్దార్ ఇసుక తరలింపునకు అనుమతినివ్వడం లేదని అంటున్నారు. కట్టిన వే బిల్లు పర్మిషన్ ఇవ్వమని తహసీల్దార్ ను రిక్వెస్ట్ చేస్తే పర్మిషన్ ఇచ్చేందుకు ససేమీరా అంటున్నారని లబ్ధిదారులు చెబుతున్నారు.

తమ ఇంటి పనులు ఆగిపోతున్నాయి, పర్మిషన్ ఇవ్వండని తహసీల్దార్ ను కలిసి అడిగితే పర్మిషన్ ఇవ్వమంటూ డీ. డీ లు వాపస్ తీసుకొంటున్నారని వాపోతున్నారు. ఇదిలా ఉండగా భీంగల్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కు అవసరం మేరకు కాంట్రాక్టర్ 100 ట్రిప్పుల ఇసుకకు డీడీలు కట్టి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా తహసీల్దార్ పర్మిషన్ నో అంటున్నారు. మండలంలో ఎక్కడా లేని విధంగా, అడ్డు అదుపు లేకుండా అక్రమ ఇసుక రవాణా జరుగుతుండడంతో అధికారులు లీగల్ ఇసుక రవాణాకు పర్మిషన్ ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు ఇక్కట్లు పడుతున్నారు. ఇల్లీగల్ పై ప్రెస్టేషన్ ను ఆఫీసర్లు లీగల్ లబ్ధిదారుల పై తీయ్యడం ద్వారా లబ్ధిదారులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు.

శ్రీలత.. తహసీల్దార్ భీంగల్

లీగల్ గా డీడీలు కట్టి వే బిల్స్ తీసుకొని ఇసుక అక్రమంగా ఇతర ప్రాంతాలకు చేరవేస్తున్నారు. ఇసుక ఎక్కడికి పర్మిషన్ తీసుకొంటే అక్కడికే రవాణా చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక అక్రమ రవాణా అవుతున్నందున ఇసుక పర్మిషన్ ఇవ్వడం లేదు. గత మూడు, నాలుగు నెలలుగా ఎన్ని ఫైన్లు వేసిన ప్రయోజనం లేదు. ఇల్లీగల్ ఇసుక రవాణా ఆపేంతవరకు పర్మిషన్ ఇవ్వడం కష్టం.


Similar News