'ది కేరళ స్టోరీ' సినిమాను వీక్షించిన నిజామాబాద్ ఎంపీ..
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ 'ది కేరళ స్టోరీ' సినిమాను వీక్షించారు.
దిశ ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ 'ది కేరళ స్టోరీ' సినిమాను వీక్షించారు. గురువారం సాయంత్రం 7 గంటలకు నిజామాబాద్ నగరంలోని "పీవీఆర్ వేణు మాల్ " లో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి 'ది కేరళ స్టోరీస్' సినిమాని వీక్షించారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దోళ్ల గంగారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త కాపర్తి శ్రవణ్, ప్రముఖ వైద్యులు మోతిలాల్ బీజేవైఎం నాయకులు రోషన్ లాల్ బోరా తదితరులు ఉన్నారు.