ఆ అధికారి అవినీతి పై సమగ్ర విచారణ జరిపించాలి..
నిజామాబాద్ జిల్లా వైద్యాధికారి డీ.ఎం అండ్ సుదర్శన్ పై వచ్చిన అవినీతి ఆరోపణల పై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డీ.ఎం అండ్ ఎచ్ ఓ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిని ప్రక్షాళన చేయాలని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు వినతి పత్రం అందజేశామని సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా నగర కార్యదర్శి ఎం.సుధాకర్ తెలిపారు.
దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లా వైద్యాధికారి డీ.ఎం అండ్ సుదర్శన్ పై వచ్చిన అవినీతి ఆరోపణల పై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డీ.ఎం అండ్ ఎచ్ ఓ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిని ప్రక్షాళన చేయాలని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు వినతి పత్రం అందజేశామని సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా నగర కార్యదర్శి ఎం.సుధాకర్ తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్స్, మెడికల్, ల్యాబ్, స్కానింగ్ సెంటర్ల దోపిడీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా నగర కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ నిజామాబాద్ వైద్య ఆరోగ్యశాఖ డీ.ఎం అండ్ ఎచ్ ఓ కార్యాలయం అవినీతికి నిలయమైందన్నారు. డీఎంహెచ్ఓ సుదర్శనం పై అనేక అవినీతి ఆరోపణలు వున్నాయన్నారు. సుదర్శనం అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలనీ, అప్పటివరకు అతన్ని భాద్యతల నుండి తప్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. డీఎం అండ్ ఎచ్ఓ కార్యాలయంలోని అధికారులందరి అవినీతి పై విచారణ జరిపించి, కార్యాలయాన్ని ప్రక్షాళన చేయాలన్నారు. గత 04 సంవత్సరాలుగా డీఎం అండ్ ఎచ్ ఓ కార్యాలయం ద్వారా జరిగిన అన్ని నియామకాల పై విచారణ జరిపించాలన్నారు. అద్దె వాహనాల బాగోతం పై సమగ్ర విచారణ జరిపించాలన్నారు.
నిజాయితీగా పనిచేసిన వాహన యజమానుల పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలన్నారు. డీ.ఎం అండ్ ఎచ్ఓ కార్యాలయ అధికారుల కుటుంబ సభ్యుల, బినామీ పేర్లతో కొనసాగుతున్న అద్దె వాహన ఒప్పందాలను రద్దు చేసి, అర్హులైన నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. డీఎంహెచ్వో కార్యాలయ ప్రక్షాళన జరిగే వరకు, ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీని అరికట్టే వరకు సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా ఆధ్వర్యంలో ఆందోళనలను కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కే.గణేష్, నగర అధ్యక్షులు అషుర్, నగర ఉపాధ్యక్షులు మహిపాల్, ప్రజాపంథా నాయకులు విఠల్, కిరణ్, సమీర్, ఫారూఖ్, అసిఫ్, గంగాధర్, రమేష్, గోపి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.