శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న వరద నీరు..

ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగాన కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు వచ్చి చేరుతుందని కె.రవి తెలిపారు.

Update: 2024-07-18 09:36 GMT

దిశ, నిజామాబాద్ : ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగాన కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు వచ్చి చేరుతుందని కె.రవి తెలిపారు. మంజీరా నుండి 6 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చిచేరుతుండగా, ఎస్సారెస్పీ ఎగువన నిర్మల్, నిజామాబాద్ జిల్లా గోదావరి పరివాహక ప్రాంతాలలో బుధవారం ఉదయం నుండి రాత్రి వరకు కురిసిన వర్షాలతో 6,500 క్యూసెక్కుల వరద వచ్చిచేరుతోందని మొత్తం 12,500 క్యూసెక్కులు వరద చేరుతుందని ఏఈఈ చెప్పారు. సాయంత్రానికి మరింత వరద పెరిగి 15 వేల క్యూసెక్కులు వచ్చి చేరే అవకాశం ఉందని వివరించారు. ఈ సీజన్లో ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల నుంచి రిజర్వాయర్ లోకి 8.777టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది అన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు 90.313 టీఎంసీలు కాగా గురువారం 1063.80 అడుగులు 14.545 టీఎంసీల నీటి నిల్వ ఉందని ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు.


Similar News