Muhammad Ali Shabbir: ఆ ఘనత మాదే

అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం దేశం మొత్తం మీద ఏకకాలంలో రుణమాఫీ చేసిందని, ఆ ఘనత కాంగ్రెస్ పార్టీ దేనని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు.

Update: 2024-07-19 14:42 GMT

దిశ భిక్కనూరు : అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం దేశం మొత్తం మీద ఏకకాలంలో రుణమాఫీ చేసిందని, ఆ ఘనత కాంగ్రెస్ పార్టీ దేనని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. శుక్రవారం నాడు ఆయన బీబీపేట మండల రైతు వేదికలో జరిగిన రుణమాఫీ సంబరాలకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందన్నారు. ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట తప్పదని స్పష్టం చేశారు. గరీబీ హటావో నినాదంతో దివంగత ప్రధాని సోనియాగాంధీ భూములను పంచగా, ఆమె కోడలు సోనియాగాంధీ నేతృత్వంలోని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీ చేసి, దేశంలోని రైతులను ఆదుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల పనులు, గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ప్రాజెక్టు పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయన్నారు. తద్వారా ఇక్కడి రైతాంగం సాగునీటికి నోచుకోలేక పోయిందన్నారు. 22వ ప్యాకేజీ కింద పనులు పూర్తి చేయించి, ఈ ప్రాంత రైతుల భూములను సస్యశ్యామలం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుతారి రమేష్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి భూమా గౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, టీపీసీసీ కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Similar News