కామారెడ్డి పెద్ద చెరువులో మట్టి స్నానాలు (వీడియో)

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువులో జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఔషధీయ మట్టి స్నానాల కార్యక్రమాన్ని నిర్వహించారు.

Update: 2024-02-18 04:38 GMT

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువులో జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఔషధీయ మట్టి స్నానాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల మూలికలు, ఔషధాలతో తయారుచేసిన మట్టిని ఒంటికి రాసుకుని సూర్యరశ్మికి నిల్చుని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా యోగాసనా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రామ్ రెడ్డి మాట్లాడుతూ.. పూర్వీకులు మనకు అందించిన అతి విలువైన, చౌకైన వైద్యం మట్టి స్నానం అన్నారు. మట్టి స్నానం వల్ల మానవుని మానసిక ఒత్తిడి దూరమై, శర్మ వ్యాధులు స్వేద రంధ్రాలు తెరుచు కుంటాయన్నారు. అంతేకాకుండా గుండె సంబంధిత వ్యాధులు కూడా దూరం అవుతాయన్నారు. నాడీ వ్యవస్థ మెరుగుపడి రక్త సరఫరా చురుకుగా సాగుతుందన్నారు. ఈ మట్టి స్నానాల్లో యోగ సభ్యులు రఘు కుమార్, అంజయ్య, సిద్దా గౌడ్, ఎల్లయ్య, డాక్టర్ దేవయ్య, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, రామచందర్, ఈశ్వర్, లక్ష్మీపతి యాదవ్, ఉర్దొండ నరేష్, శివాజీ రావు, లింగారావు తదితరులు మరో వంద మంది పాల్గొన్నారు.


Similar News