బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన ఎంఆర్‌పీఎస్ నాయకులు..

Update: 2023-11-20 14:22 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని ఎంఆర్పిఎస్ జిల్లా కమిటీ అధ్యక్షులు కనక ప్రమోద్ ఆధ్వర్యంలో బీజేపీ అభ్యర్థి ధన్ పాల్ సూర్యనారాయణను కలసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాట్లాడుతూ.. ఎంఆర్పిఎస్ బీజేపీకి అండగా ఉంటుంది అన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక మోదీ ఎస్సీ వర్గీకరణకు కమిటీ వేయడం శుభపరిణం అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మాదిగలను మోసం చేశాయని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిగ సమాజన్ని అణచి వేసిందన్నారు.

నిజామాబాద్ నగరంలో మాదిగల బతుకు మారాలంటే నిజామాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ధన్ పాల్ సూర్యనారాయణ కోసం కష్టపడుతూమాని తెలిపారు. వారికీ అండగా ఉంటామని వారి గెలుపులో ఎంఆర్‌పీఎస్ కృషి ఉంటుంది అంటున్నారు. షబ్బీర్ అలీ, బిగలా గణేష్ ఓటమే లక్ష్మ్యంగా మేము పనిచేస్తామని అన్నారు. ఈ సందర్బంగా సూర్యనారాయణ ఎంఆర్‌పీఎస్ నాయకులకు ధన్యవాదములు తెలిపారు. మాకు మద్దతుగా నిలిచిన మీ అందరికి రుణపడి ఉంటామని తెలిపారు. భవిష్యత్తులో మీకు అండగా నిలబడుతుమని అన్నారు. ఎంఆర్‌పీఎస్ నాయకులు గంగన్న, శ్రీరామ్, రోడ్డ ప్రవిణ్ నాయకులు పాల్గొన్నారు.


Similar News