మద్యం సిట్టింగ్ నిర్వహిస్తున్న హోటల్ పై పోలీసుల దాడి
కామారెడ్డి పట్టణంలో అనుమతులు లేకుండా మద్యం సిట్టింగ్ నిర్వహిస్తున్న
దిశ, కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలో అనుమతులు లేకుండా మద్యం సిట్టింగ్ నిర్వహిస్తున్న ఓ హోటల్ పై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి కేసు నమోదు చేశారు. పట్టణంలోని విజయ దుర్గ భవాని హోటల్ లో మద్యం సిట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు దాడి చేసి మద్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ ఎస్సై విక్రమ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఎక్కడైనా ఈవెంట్స్ నిర్వహించినప్పుడు ఎక్సైజ్ శాఖ అనుమతి తీసుకోవాలన్నారు. ఈవెంట్లలో, హోటళ్లలో అనుమతి లేకుండా మద్యం సేవిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.