బీఆర్ఎస్ మేనిఫెస్టోను చించివేసిన ఎంపీ ధర్మపురి అర్వింద్ (వీడియో)
అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసిన బీఆర్ ఎస్ మేనిఫెస్టోను నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ చించివేయడం వివాదాస్పదమైంది.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసిన బీఆర్ ఎస్ మేనిఫెస్టోను నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ చించివేయడం వివాదాస్పదమైంది. ఆదివారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్ పల్లి లో జరిగిన బీజేపీ రూరల్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఎంపీ అరవింద్ బీఆర్ఎస్ మేనిఫెస్టో ను చించివేశారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ కేసీఆర్ రూరల్ నియోజకవర్గ ప్రజలు నీకు జీవిత బీమా చేస్తారని వ్యాఖ్యానించారు. నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలు బీజేపీ విజయం పక్కా అన్నారు. కాంగ్రెస్ మూడో స్థానంకే పరిమితమౌతుందన్నారు. బీజేపీ అధిష్టానం దినేష్ కి టిక్కెట్ ఇస్తే రూరల్ బీజేపీ ఎమ్మెల్యే దినేష్ విజయం తధ్యమన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అమ్మెస్తారని విమర్శించారు.
భారాసా మేనిఫెస్టోలో గల్ఫ్ కార్మికుల ప్రస్తావన లేదని, కేసీఆర్ ని మేనిఫెస్టో పనికిరాదన్నారు. భారస 2023 మేనిఫెస్టోలో తెలంగాణలో చనిపోయిన వారికి 5 లక్షలు ఎందుకు బతికి ఉన్నపుడు ఇవ్వాలన్నారు. కేసీఆర్ నువ్వు చనిపోతే 15 లక్షలు తాను ఇస్తానని వ్యాఖ్యానించారు. గల్ఫ్ బోర్డు ఎక్కడ అని, రూరల్ ప్రాంతంలో లక్ష ఎకరాల సాగునీరు ఎక్కడ అని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ప్రతి గ్రామానికి 15 వేల ఇళ్లు కట్టిస్తామని అన్నారు. తాము అధికారంలోకి వస్తే సారంగపూర్ కోఆపరేటివ్ చెక్కర ఫ్యాక్టరీ తెరిపిస్తామని అన్నారు. తెలంగాణ లో పంటలకు నష్ట పరిహారం లేదని, తెలంగాణ యూనివర్సిటీని సార్వనాశనం చేశారని, ప్రొఫెసర్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. జక్రాన్ పల్లి ఎయిర్ పోర్ట్ ఎక్కడ అని, మీ ఎమ్మెల్యే ను నిలదీయాలని, కేసీఆర్ ముందు జక్రాన్ పల్లి ఎయిర్ పోర్ట్ ఏర్పాటు కు స్థలం ఇవ్వాలన్నారు. డిచ్చిపల్లి సీఐ దళితుల పై దాడులు మానుకోవాలని, కర్ణాటక కాంగ్రెస్ లారీలలో డబ్బులు తెలంగాణ కు ఎందుకు తరలిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సంచులలో డబ్బులు మోసుడు బంద్ చేసి లారీల్లో మోస్తున్నాడని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే ధరణి ని రద్దు చేస్తామన్నారు.