బండి సంజయ్ Arrest ను ఖండించిన MP Aravind

దిశ ప్రతినిధి, నిజామాబాద్: బీజేపీ కార్యకర్తల మీద సోమవారం రోజు టీఆర్ఎస్ నాయకులు, పోలీసులు చేసిన దాడికి నిరసనగా

Update: 2022-08-23 06:32 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: బీజేపీ కార్యకర్తల మీద సోమవారం రోజు టీఆర్ఎస్ నాయకులు, పోలీసులు చేసిన దాడికి నిరసనగా ధర్మదీక్ష కు పిలుపు నిచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని ప్రభుత్వం అరెస్ట్ చేయించడానికి తీవ్రంగా ఖండిస్తున్నానని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రకటన విడుదల చేశారు. అరెస్ట్‌కు కారణాలు చెప్పకుండా పాదయాత్ర చేస్తున్న సంజయ్ ని తీసుకువెళ్లడం అన్యాయం అన్నారు. పోలీసులు ప్రభుత్వ తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు.

అందుకే ప్రభుత్వంతో కలిసి బీజేపీ నాయకులపైన అక్రమ కేసులు పెడుతూ.. అరెస్ట్‌లకు పాల్పడుతున్నారు ఆని విమర్శించారు. బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి కేసీఆర్ ప్రభుత్వం భయపడుతుందనీ, ఇలాంటి చర్యలతో బీజేపీ కార్యకర్తలను భయపెట్టలేరన్నారు. ఈ అక్రమాలన్నింటికి టీఆర్ఎస్ త్వరలోనే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన బండి సంజయ్‌ని వెంటనే విడుదల చేయాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News