పొగ మంచుతో వాహనదారులు జాగ్రత్త

పొగమంచు కారణంగా ఉదయం రోడ్డు పైకి వచ్చే వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ సింధు శర్మ సూచించారు.

Update: 2023-12-27 10:32 GMT

దిశ, కామారెడ్డి : పొగమంచు కారణంగా ఉదయం రోడ్డు పైకి వచ్చే వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ సింధు శర్మ సూచించారు. పొగమంచు వల్ల సరిగా కనపడక పోవడంతో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని, ప్రమాదాలు జరగకుండా నడపాలని కోరారు. వాహనం హెడ్‌లైట్‌లను తక్కువ దూరంలో ఉండేట్లు గా పెట్టుకోవాలని, వాహన వేగాన్ని తగ్గించాలని సూచించారు.

    ఎదురుగా వచ్చే వాహనాల శబ్దాన్ని విని మీ వాహనాన్ని నడపాలన్నారు. ఇండికేటర్ లను వాడుతూ, మలుపు తిరిగేటప్పుడు వెనక నుండి వచ్చే వాహనాలు నెమ్మదిగా వెళ్లేలా కనీసం పది సెకన్ల పాటు సూచన ఇవ్వాలని సూచించారు. ముందు వెళ్తున్న వాహనాలను ఓవర్ టేక్ చేయవద్దని కోరారు. వాహనాల మధ్య దూరం పాటించాలని, రహదారిపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. ట్రాఫిక్, వాతావరణ పరిస్థితులపై దృష్టి పెట్టడం ప్రతి డ్రైవర్ బాధ్యత అన్నారు.   


Similar News