మండలానికి స్పెషల్ ఆఫీసర్ ఉన్నారా..? లేరా..?

సర్పంచుల పదవీకాలం ముగియడంతో సర్పంచ్ లేని లోటు తీర్చేందుకు ఆయా మండల తహశీల్దార్ కు ప్రత్యేక స్పెషల్ ఆఫీసర్ గా ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

Update: 2024-07-14 12:10 GMT

దిశ, గాంధారి : సర్పంచుల పదవీకాలం ముగియడంతో సర్పంచ్ లేని లోటు తీర్చేందుకు ఆయా మండల తహశీల్దార్ కు ప్రత్యేక స్పెషల్ ఆఫీసర్ గా ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో సర్పంచ్ చేయాల్సిన పూర్తిపనులు, బాధ్యతలు స్పెషల్ ఆఫీసర్ కు అప్పగించింది. అయితే క్షేత్రస్థాయిలో అభివృద్ధి మాట దేవుడెరుగు ఉన్న పనులైనా చేయిస్తే బాగుండు అని ప్రజలు అనుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా గాంధారి మండలం దుర్గానగర్ కాలనీలో జరిగిన యదార్థ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

మండలానికి స్పెషల్ ఆఫీసర్ ఉన్నారా.. లేరా...

సర్పంచ్ పదవీకాలం ముగియడంతో స్పెషల్ ఆఫీసర్ నియమించిన తహశీల్దార్ గ్రామపంచాయతీ కార్యాలయానికి రావడానికి మొగ్గు చూపడం లేదు. తద్వారా ఎక్కడ వేసినా పనులు అక్కడే ఉండిపోయాయి. ముఖ్యంగా పారిశుధ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో దోమల బెడద ఎక్కువై సీజనల్ వ్యాధుల బారిన పడి అధిక సంఖ్యలో ప్రజలు జ్వరాలకు గురవుతున్న సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా ఐదు రోజుల వ్యవధిలో ఏడుగురిని కోతులు గాయపరిచిన సంఘటన కాలనీవాసులు భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఇప్పటివరకు స్పెషల్ ఆఫీసర్ ఇప్పటి వరకు ఏ వార్డులో కానీ సందర్శించిన దాఖలాలు లేవు.

మూడు రోజుల్లో 8 మందిని గాయపరిచిన కోతులు...

కేవలం మూడు రోజుల్లో 8 మందిని గాయపరిచినట్లుగా గాంధారి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన బాధితుల పేర్లు నమోదు చేశారు. అలాగే నెల వ్యవధిలో 30 రోజుల్లో 29 మంది కాగా, గాంధారి మండల కేంద్రంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన బాధితులు ఇంకా ఎక్కువగానే ఉన్నారు. హాస్పిటల్ లో కుక్కల, కోతుల ద్వారా గాయపడిన వ్యక్తులు అధిక సంఖ్యలోనే రోజురోజుకు నమోదు అవుతున్నాయని, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. కోతుల బీభత్సం నుండి ప్రజలు కోతులు కనిపిస్తే జంకే పరిస్థితి నెలకొంది. కోతులు మందగావచ్చి దాడి చేయడం, తద్వారా బాధితులు చికిత్స వ్యాక్సిన్ ను దాదాపు నాలుగు వారాల పాటు నాలుగు విడతలుగా నాలుగు వ్యాక్సిన్ లను ఇస్తారని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.

డబ్బుల కొరత ఉంది త్వరలోనే పరిష్కరిస్తాం.. జీపీ సెక్రెటరీ నాగరాజు

గ్రామపంచాయతీలో నిధుల కొరత ఉన్నందువల్ల విలేజ్ డెవలప్మెంట్ కమిటీని కూడా కోతుల సమస్య గురించి వివరించామని తెలిపారు. అయితే వీడీసీ నుంచి డబ్బులు అందితే అతి తొందరలోనే కోతుల బెడదను తొలగిస్తామని లేకపోతే, తప్పనిసరిగా స్పెషల్ ఫండ్ ఉపయోగించి మండల ప్రత్యేక అధికారి దృష్టికి తీసుకెళ్లి ఎట్టి పరిస్థితుల్లో కోతుల బారి నుంచి కాపాడేందుకు కోతులు పట్టుకునే చర్యలు తీసుకుంటామని అన్నారు.


Similar News