అమ్మ ఆదర్శ పాఠశాల పనులు త్వరగా పూర్తి చేయాలి.. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి

అమ్మ ఆదర్శ పాఠశాల పనులు త్వరగా పూర్తి చేయాలని కామారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Update: 2024-06-21 13:34 GMT

దిశ, నిజాంసాగర్ : అమ్మ ఆదర్శ పాఠశాల పనులు త్వరగా పూర్తి చేయాలని కామారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించారు. ఈ నెల 26వ తేది వరకు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పీఆర్ఎఈ సురేష్ లీవ్ పై వెళ్లడంతో పనులు పూర్తి చేయకుండా లీవ్ పై ఎలా వెళ్లారని ఎంపీడీఓ గంగాధర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజులుగా లీవ్ పై వెళ్తే పనులు ఎవరు చేస్తారని, లీవ్ ఇచ్చిన అధికారులు ఎవరికైన పనులను అప్పగిస్తే పనులు పూర్తి అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పీఆర్ డిప్యూటీ రవీందర్ బాబు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, పాఠశాల భవనం పనులు నిలిచిపోవడంతో విద్యార్థులకు పాఠశాలలు పునః ప్రారంభమై వారం రోజులు గడుస్తున్న పనులు ఇంకా పూర్తి కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్త్రీలు రోజువారీగా రాక పోవడంతో పనులకు ఆలస్యం జరిగినట్లు ఎంపీడీఓ గంగాధర్ తెలిపారు. పనులు అసంపూర్తిగా ఉండటంతో అసంతృప్తి చెందారు. ఈ నివేదికను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్ సమర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గంగాధర్, ఎంపీఓ యాదగిరి, పీఆర్ డిప్యూటీ రవీందర్ బాబు, ప్రధానోపాధ్యాయులు యన్.రాంచందర్, రాజు, వెంకటేశం, షాదుల్లా, రాములు, విజయ్ కుమార్, సీఆర్ప్ శ్రీధర్, గ్రామ పంచాయితీ కార్యదర్శిలు రవికుమార్, తుకారాం తదితరులు పాల్గొన్నారు.


Similar News