నిరుపేదలకు పథకాలు అందాలన్నదే మోదీ లక్ష్యం

నిరుపేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు అందాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు.

Update: 2024-01-22 13:39 GMT

దిశ, కామారెడ్డి : నిరుపేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు అందాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తాలో సోమవారం వికసిత భారత్ ఎల్ఈడీ స్క్రీన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టణంలో వీధి వ్యాపారులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందజేస్తూ పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందజేస్తుందని తెలిపారు. రుణాలు సక్రమంగా చెల్లించిన వీధి వ్యాపారులకు బ్యాంకుల ద్వారా రెట్టింపు రుణాలు ఇస్తున్నాయని చెప్పారు.

    వీధి వ్యాపారులు లబ్ధి పొందిన తీరును ఈ సందర్భంగా లబ్ధిదారులు వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా క్యాలెండర్లను, వాల్ పోస్టర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను పాటల రూపంలో పాడి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో మెప్మా పీడీ శ్రీధర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి, లీడ్ బ్యాంక్ మేనేజర్ భార్గవ్, డీఎన్ఓ, ఎస్బీఐ మేనేజర్ వినయ్ చంద్ర, పీఆర్​పీ సునీత, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, వీధి వ్యాపారులు, రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు. 


Similar News