బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్..

భారత దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటులో ప్రజాస్వామ్యం పై విశ్వాసం ఉంచిన పార్టీలు ఉన్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.

Update: 2023-03-31 11:51 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : భారత దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటులో ప్రజాస్వామ్యం పై విశ్వాసం ఉంచిన పార్టీలు ఉన్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పార్టీకి కొన్ని మౌలిక సిద్ధాంతాలు ఉంటాయని, పార్టీలకు మధ్య కొన్ని సిద్ధాంత విభేదాలు ఉంటాయని దేశంలోనే ప్రతిపక్షాలైన తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, కమ్యూనిస్టు పార్టీలతో కాంగ్రెస్ పార్టీకి కొన్ని సిద్ధాంత విభేదాల ఉన్నాయన్నారు. అయినప్పటికీని ఆ విధంగా వాటికి తావివ్వకుండా ప్రజాస్వామ్యం కూని అయ్యేవిధంగా ఆప్రజాస్వామికంగా రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడం పై వివిధ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయన్నారు. బీజేపీ ప్రభుత్వం వల్ల ప్రజాస్వామ్య మనుగడకే ముప్పు వాటిల్లుతుందని అన్నారు.

ఈ తరుణంలో పార్టీలన్నీ కలిసి రావాలని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సైతం అప్రజాస్వామిక వ్యవస్థను ఖండించారని అన్నారు. రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు ఏదైతే ఉందో కర్ణాటకలో చేసినటువంటి ప్రసంగాన్ని ఆసరా చేసుకుని సూరత్ కోర్టులో ఆయనకు శిక్ష విధించటం అనర్హత వేటు విధించడం సరికాదన్నారు. ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీపై అనర్హత వేటను విధించి దీంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లు అయిందని అన్నారు. ఈ చర్యను కేసీఆర్ ఖండించారన్నారు. ఇక దేశంలో, ఇటు రాష్ట్రంలో దొందు దొందు పార్టీలే అని జీవన్ రెడ్డి అన్నారు. రాజకీయ జీవితంలో బాండ్ రాసివ్వడం ఎప్పుడు చూడలేదని అన్నారు. 5 రోజుల్లో పసుపు బోర్డ్ తెస్తానని రాసి ఇవ్వడంతో రైతులు పసుబోర్డు ఏమైందనే అడిగి హక్కు వారికుందని అన్నారు. పది సంవత్సరాల క్రితం పసుపు ధర 10 వేలు ఉంటే ఇప్పుడు 4, 5 వేలు మించి క్వింటాలుకు అమ్ముడుపోవడం లేదన్నారు. అట్లాగే కేసీఆర్ షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని ఎన్నికలలో చెప్పి ఆ ఊసే లేకుండా చేశారన్నారు.

నిజామాబాద్ కరీంనగర్ జగిత్యాల జిల్లాలలో వారికి ప్రత్యమ్నయం చెరికేనని బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తామని వాగ్దానం చేసి కేసీఆర్ ప్రభుత్వం మర్చిపోయిందన్నారు. మా దగ్గర మెట్ పల్లి మల్లాపూర్ కు చెందిన చక్కెర కర్మాగారం 51 శాతం ప్రైవేట్ కు విక్రయిస్తే ప్రభుత్వ పరం చేస్తామని కేసీఆర్ వాగ్దానం చేసారని అన్నారు. అది కూడా మరిచారన్నారు. ఇవ్వాళ ఇద్దరు దొంగలే అని బీజేపీ, బీఆర్ఎస్ తోడు దొంగలన్నారు. ఎవరు సత్యవంతులు కారని అన్నారు. నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలలో రైతాంగాన్ని మోసం చేయడానికి పోటీ పడుతున్నారని అన్నారు. బీజేపీ పసుపు బోర్డు అని మోసం చేస్తే, టీఆర్ఎస్ చక్కెర కర్మాగారం అని చెప్పి మోసం చేస్తుందన్నారు. రాహుల్ గాంధీ పై పార్లమెంటులో గలం నొక్కేయాలని చూస్తూ ప్రభుత్వం కేటాయించిన ఇంటిని నుంచి బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారని, రాహుల్ గాంధీ ప్రతి నిరుపేదల గుండెల్లో ఉన్నాడని అన్నారు. ఈ దేశంలో ఉన్న నిరుపేద వర్గాలు తనకు ఆశ్రయం కల్పించడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు.

దేశంలో కులమతాల మధ్య చిచ్చుపెట్టేలా చూస్తున్న బీజేపీ ప్రభుత్వన్ని తుద ముట్టించడమే కాంగ్రెస్ లక్ష్యం అన్నారు. లలిత్ మోడీ కి భారత దేశంలో ఉన్న న్యాయవ్యవస్థ పై విశ్వాసం లేదా లండన్ కోర్ట్ కు ఈడుస్తానని ఎలా అన్నాడని అన్నారు. దేశం నుంచి ఆర్థికంగా మోసం చేసి పారిపోయిన ఒక ఆర్థిక నేరస్తుడని లలిత్ మోడీ నీకు ఈ దేశంకు వచ్చే దమ్ము లేదని అన్నారు. నీ మీద కించపరిచేటట్లు ఏమైనా వ్యాఖ్యలు చేస్తే భారత దేశంలోకి వచ్చి కేసులు పెట్టాలని, ఇక్కడికి వస్తే నీ మీద కూడా కేసులు పెడతామని అన్నారు. భారతదేశంలో మేధావులు విద్యార్థులు ప్రజలు ప్రజాస్వామ్య పరిరక్షణకు మీ తోడ్పాటు అందించాలన్నారు. ఈ ప్రెస్ మీట్ లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హందాన్, పీసీసీ సీనియర్ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి , నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు, జగిత్యాల్ మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, ముప్ప గంగారెడ్డి, నీరడ్డి భాగ్య, విక్కీ యాదవ్, వేణు రాజ్, రాజ నరేంద్ర గౌడ్, రామర్తి గోపి, విపుల్, జావిద్ అక్రమ్, రేవతి, గడుగు రోహిత్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News