ఎల్లారెడ్డిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుక పండుగలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ పాల్గొన్నారు.

Update: 2024-12-24 11:39 GMT

దిశ ,ఎల్లారెడ్డి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుక పండుగలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ..క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ ,నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. క్రైస్తవ సోదరులకు సంవత్సరానికి ఒకసారి వచ్చే పెద్ద పండగ అని కొనియాడారు. ఎల్లారెడ్డి నియోజక వర్గం అభివృద్దే తన లక్ష్యమని ఎమ్మెల్యే మదన్మోహన్ అన్నారు. త్వరలోనే పేదలకు ఇండ్ల అందించే ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. అర్హులైన పేదలకు పట్టాలు పొందే రోజులు ముందున్నాయని అన్నారు. కామారెడ్డి నుండి ఎల్లారెడ్డి వరకు ప్రధాన రహదారి పనులను ప్రారంభిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రోడ్ల భవనల శాఖ మంత్రిని కోరగా..50లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ తెలిపారు. వైద్యం ఖర్చుల కోసం సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీని లబ్ధిదారులకు నేరుగా ఇంటికి వెళ్లి అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్డీవో మన్నే ప్రభాకర్,ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు,ఎల్లారెడ్డి మండలంలోని పలు చర్చిలకు సంబంధించిన పాస్టర్ లు మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News