హైదరాబాద్ లో గాంధారి యువతి ఆత్మహత్య
హైదరాబాద్ లో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.
దిశ , గాంధారి: హైదరాబాద్ లో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. గాంధారి మండలం అవుసులకుంట తండాకు చెందిన యువతి సురేఖ(22) సోమవారం రాత్రి హైదరాబాద్ లోని తన రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సదరు యువతి హైదరాబాద్ లో గ్రూప్ 2 కోచింగ్ తీసుకుంటుందని, గత కొన్ని రోజుల క్రితం యువతికి వివాహం నిశ్చయమైందని తండా వాసులు తెలిపారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి మాజీ ఎంఎల్ఏ నల్లమడుగు సురేందర్ ఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.