MLAలకు వరద కష్టాలు.. రైతులకు, ప్రజలకు హామీ ఇవ్వలేక ఇబ్బందులు
జిల్లాలో 76 ఇళ్లు కూలిపోగా, నాలుగు రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. నాలుగు చెరువులు తెగిపో యాయి. కామారెడ్డి జిల్లాలోనూ భారీ వర్షం అతలాకుతలం చేసిన విషయం తెల్సిందే. ఉమ్మడి జిల్లాలో కురిసిన భారీ వర్షం
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో 76 ఇళ్లు కూలిపోగా, నాలుగు రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. నాలుగు చెరువులు తెగిపో యాయి. కామారెడ్డి జిల్లాలోనూ భారీ వర్షం అతలాకుతలం చేసిన విషయం తెల్సిందే. ఉమ్మడి జిల్లాలో కురిసిన భారీ వర్షం దెబ్బకు ప్రజాప్రతినిధులే మొహం చాటేసిన విషయం తెల్సిందే. 24న కురిసిన భారీ వర్షం దాటికి ప్రజాప్రతినిధులెవ్వరు బయటకు రాలేదు. 25న మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మె ల్యేలు బయటకు వచ్చారు. జిల్లాలో మంత్రి ప్రశాంత్ రెడ్డి ఒక్కరే తొలిరోజు పర్యటించా రు. 26న అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త, 27న జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్ లు పర్యటించారు. కామారెడ్డి జిల్లాలో 27న రాష్ట్ర సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తన నియోజకవర్గంలో పర్యటించారు. జుక్కల్ లో హన్మం త్ షిండే పర్యటించారు. 29న ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పర్యటించారు. బోధన్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు మాత్రం నియోజకవర్గాల్లో పర్యట నకు దూరంగా ఉన్నారు. అయితే అప్పటికే అధికార యంత్రాంగం పంట నష్టం అంచనా వేసే పనిలో పడ్డారు. కానీ ఒక్క ఎమ్మెల్యే కూ డా భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామని మాత్రం హామీ ఇవ్వలేకపోయారు. దానికి కారణం ఉంది.
జిల్లాలో ఏప్రిల్ చివరి వారం రోజులుగా కురిసిన అకాల వర్షాలతో సుమారు 30వేల ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. ప్రభు త్వం రైతులను ఆదుకోవాలని ప్రతిపక్షాలు కోరి నా మొన్నటి వరకు జరిగిన నష్టాన్ని 30 శాతం పంట నష్టం ఉంటే 10వేల చొప్పున ఎకరానికి పంట నష్టపరిహారం ఇస్తామని ప్రకటించిన విషయం తెల్సిందే. 30శాతం కన్నా తక్కువగా ఉన్న వారి పరిస్థితి దయనీయంగానే ఉంది. కామారెడ్డి జిల్లాలో 59,500 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. రైతు లు రోడ్లపై కల్లాల్లో ఎండబెట్టేందుకు ఉంచిన ధాన్యం కూడా తడిసిపోయింది. వర్షాలకు చాలా ప్రాంతాల్లో ధాన్యం మొలకలు రావడం దారుణం. మే మొదటి వారంలో నిజామాబాద్ జిల్లాలో 25వేల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు అధికారులు ప్రకటించారు. కామారెడ్డి జిల్లాలో 12 వేల క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఏప్రిల్, మే మాసాల్లో నిజామాబాద్ జిల్లాలో 31, 567 ఎకరాల్లో, కామారెడ్డి జిల్లాలో 63 వేల ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. అందులో 30 శాతానికి మించి పంట నష్టపోయిన వారికి మాత్రమే పరిహారం ఇస్తామని ప్రకటించడంతో ఆ నిధులు ఎప్పుడు వస్తాయని రైతు లు ఆశగా ఎదురు చూశారు. మార్చి నెలకు సంబంధించిన కేవలం 467 ఎకరాల పంట నష్టాలకు 46 లక్షల పరిహారం మంజూరు కాగా రైతుల ఖాతాలో నమోదుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం అందిస్తామన్న రూ.10 వేల పరిహారం ఏ మూలకు సరిపోదని ఎంతో కొంత వస్తుందని ఆశపడితే 30 శాతం నిబంధన రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. సంబంధిత నష్టపరిహారం రైతుల ఖాతాలో చేరకముందే వర్షాకాలం వేసిన పంటలు వేసినట్లే నీటమునిగి తీవ్ర నష్టాన్ని చవి చూపించాయి.
ఉమ్మడి జిల్లాలో జులై చివరి వారంలో కురిసిన భారీ వర్షం ప్రజలకు, రైతులతో పాటు ప్రజాప్రతినిధులకు తలనొప్పులు తెచ్చాయి. వర్షాకాలం ప్రారంభం సమయంలో జూన్ మాసంలో ఒకటి, రెండు రోజులు ఒక మోస్తారు వర్షం పడిన విషయం తెల్సిందే. అధికార యంత్రాం గం ఆధ్వర్యంలో తాత్కాలికంగా వసతి, అన్నసదుపాయాలు కల్పించారు. కానీ జరిగిన పంట ఆస్తినష్టాలకు ఎలాంటి హామీ ఇవ్వకపోవడంపై ప్రజల్లో నిరాశ నెలకొంది. కొన్ని స్వచ్చంద సంస్థలు మాత్రం తీవ్రంగా నష్టపోయిన వారికి నిత్యావసర సరుకులు మొదలుకుని ఆర్థిక సాయాన్ని అందజేశారు. ప్రజాప్రతినిధులు మాత్రం ప్రజలకు హామీ ఇవ్వలేక ప్రభుత్వంపై భారం వేశారు. ఎన్నికల సీజన్ కావడంతో వారు ప్రజలకు సమాదానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. జూన్ మాసంలో ప్రారంభం కావాల్సిన వానాకాలం దాదాపు నెల రోజులు ఆలస్యంగా ప్రారంభమై కురిసిన భారీ వర్షం రైతులకు , ప్రజలకు కడగండ్లను మిగిల్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 3వ అత్యధిక వర్షపాతం నిజామాబాద్ జిల్లాలో కురవగా, కామారెడ్డి జిల్లాను రెడ్ అలర్ట్ ప్రకటించేంతగా వర్షం కురిసింది. వర్షం దెబ్బకు నిజామాబాద్ జిల్లాలో 36 వేల ఎకరాలు నీట మునిగింది. కామారెడ్డిలో దాదాపు 20 వేల ఎకరాల్లో పంట నష్టం సంభవించింది.