ఆటలతో మానసిక ఉల్లాసం - జుక్కల్ ఎమ్మెల్యే సీంధే

ఆటలు ఆడితే మానసిక ఉల్లాసం కలుగుతుందని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సీంధే అన్నారు.

Update: 2022-09-25 10:36 GMT

దిశ, జుక్కల్ : ఆటలు ఆడితే మానసిక ఉల్లాసం కలుగుతుందని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సీంధే అన్నారు. పెద్ద ఎడ్గి గ్రామంలో స్వామి వివేకానంద యూత్ క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే హన్మంత్ సీంధే ప్రారంభించారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ లో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆటలు ఆడటం వల్ల ఆరోగ్యంగా ఉంటారని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం యువకుల కోసం క్రికెట్ పోటీలు నిర్వహిస్తుందని అన్నారు. క్రికెట్ టోర్నమెంట్ లో మొదటి స్థానంలో నిలిచిన వారికి 30 వేయి రూపాయల, రెండవ స్థానంలో నిలిచిన వారికి 15 వేయి రూపాయలు, షీల్డ్ అందిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుర్నర్ యశోద నీల్ పటేల్, ఎంపీటీసీ సునిత, మద్నుర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయి గౌడ్, రైతు సమన్వయకమిటీ చైర్మన్ గంగాధర్ నాయక్, సొసైటీ చైర్మన్ శివనంద్, మాజీ ఎంపీటీసీ వెంకట్ గౌడ్, మాజీ సోసైటీ చైర్మన్ రాజు పటేల్, బోల్లి గంగాధర్, పటాన్ మొహిన్ ఎంపీటీసీ, స్వామి వివేకానంద యూత్ క్రికెట్ టోర్నమెంట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News