మిషన్ భగీరథ నీటినే త్రాగాలి : కలెక్టర్

మిషన్ భగీరథ నీటిని తప్పకుండా త్రాగాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఆయన నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో మార్పు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపుదిద్దిన ప్రభుత్వ పాఠశాల పరిశీలించారు.

Update: 2024-06-12 16:47 GMT

దిశ, నిజాంసాగర్: మిషన్ భగీరథ నీటిని తప్పకుండా త్రాగాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఆయన నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో మార్పు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపుదిద్దిన ప్రభుత్వ పాఠశాల పరిశీలించారు. ఎంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దిన మార్పు ఫౌండేషన్ సంస్థకు అభినందించారు. అనంతరం ఆయన గ్రామస్తులతో మాట్లాడుతూ.. గ్రామంలో అందరూ తప్పకుండా మిషన్ భగీరథ నీటిని త్రాగాలని కోరారు. పాఠశాలలో మిషన్ భగీరథ నీటిని విద్యార్థులు తాగే విధంగా ప్రోత్సహించాలని కోరారు. మిషన్ భగీరథ నీటిని ప్రభుత్వం శుద్ధి చేసి సరఫరా చేస్తుందని తెలిపారు. బోరు నీటి కంటే ప్రభుత్వం సరఫరా చేస్తున్న నీటినిలో పోషకాలు మెరుగ్గా ఉంటాయని సూచించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మిషన్ భగీరథ నీరు త్రాగే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ బడుల్లో అమ్మ ఆదర్శ పాఠశాలలో మౌలిక వసతులు విద్యుత్ సరఫరా, తాగు నీరు, కనీస సౌకర్యాల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.

జాయింట్ సర్వేతోనే రైతుల సమస్యకు పరిష్కారం..

పోడు భూముల సమస్యకు జాయింట్ సర్వే నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. మాగి గ్రామంలో పోడు భూముల సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, అటవీ శాఖ అధికారులతో మాట్లాడి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రెవెన్యూ అధికారులతో సమావేశం చేసి అటవీ శాఖ భూమి మొత్తం విస్తీర్ణం వివరాలు తీసుకుని జాయింట్ సర్వే చేసి రైతులకు న్యాయం చేస్తామని చెప్పారు. మండలంలో గతంలో సింగీతం, తుంకిపల్లి గ్రామాలలో సమస్య పరిష్కరించినట్లు తెలిపారు. అదేవిధంగా సమస్య ఉన్న ప్రతి గ్రామంలో రైతులకు న్యాయం చేస్తామని హామీ నిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటి సి. జయ ప్రదీప్, మండల అధ్యక్షుడు మల్లికార్జున్, అనీస్ పటేల్, గుర్రపు శ్రీనివాస్, చీకోటి మనోజ్ పటేల్, ప్రజా పండరి, బొజ్జ అంజయ్య, గాండ్ల రమేష్, రాము రాథోడ్, చింత కింది శేఖర్, తహసీల్దార్ బిక్షపతి, ఆర్ ఐ అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.


Similar News