మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో ముఖ్యం.. మంత్రి శ్రీనివాస్ గౌడ్

మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో ముఖ్యమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

Update: 2023-02-24 13:58 GMT

దిశ, నిజామాబాద్ సిటీ: మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో ముఖ్యమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. టీఎన్జీవో 34వ జిల్లా స్థాయి అంతర్ శాఖల క్రీడోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం ఐ డి ఓ సి కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర క్రీడల, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ మాత్యులు శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా, ఎంప్లాయ్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మామిళ్ళ రాజేందర్, టిఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, నగర మేయర్ దండు నీతూ కిరణ్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హాజరయ్యారు. ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్ అలుక కిషన్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి సంఘం అమృత్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులందరూ సాధారంగా ఆహ్వానించి అతిధుల చేతుల మిదిగా జ్యోతి ప్రజ్వలన చేశారు.

ముఖ్య అతిథులు క్రీడా పతాకావిష్కరణ చేసిన అనంతరం గౌరవ వందనం (మార్చ్ ఫాస్ట్) స్వీకరించారు. ముఖ్య అతిథులు క్రీడాజ్యోతిని క్రీడాకారులు సంయుక్తంగా మైదానంలో పరిగెత్తుకుంటూ చివరగా ఎంప్లాయ్ జేఏసీ చైర్మన్ అలుక కిషన్ కు అందించగా అలుక కిషన్ మంత్రికి అందజేయడంతో క్రీడాజ్యోతిని వెలిగించి క్రీడాకారులతో, క్రీడా ప్రతిజ్ఞ చేయించి, క్రీడోత్సవాలు ప్రారంభించినట్టుగా ప్రకటించారు. అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి మంత్రి మంత్రి మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా కరోనా వల్ల ఆగిపోయిన 34 వ అంతర్ శాఖల జిల్లా స్థాయి క్రీడలను ఇంతటి ఘనంగా నిర్వహించిన టిఎన్జీవో జిల్లా అధ్యక్ష కార్యదర్శులను, జిల్లా కార్యవర్గాన్ని అభినందిస్తున్నామన్నారు. క్రీడల్లో పాల్గొనబోయే క్రీడాకారులందరూ క్రీడా స్పూర్తితో ఉత్సాహంగా ఆడాలన్నారు. కార్యక్రమంలో టిఎన్జీవో అన్ని యూనిట్ శాఖల అధ్యక్ష కార్యదర్శులు జిల్లా కార్యవర్గ సభ్యులు అన్ని శాఖల ఉద్యోగులు క్రీడాకారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News