Disha Effect : మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన ఏఎంఓ...
శనివారం దిశ దినపత్రికలో ప్రచురితమైన విద్యార్థులకు కారం మెతుకులే దిక్కు అనే శీర్షిక పై ఆదివారం జిల్లా విద్యాధికారి దుర్గాప్రసాద్ కొత్తపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు కారంపొడితో భోజనాలు పెట్టిన మధ్యాహ్న భోజన నిర్వహకుల పై ఆగ్రహం వ్యక్తం చెసి వెళ్లిన విషయం అందరికీ తెలిసింది.
దిశ, కోటగిరి : శనివారం దిశ దినపత్రికలో ప్రచురితమైన విద్యార్థులకు కారం మెతుకులే దిక్కు అనే శీర్షిక పై ఆదివారం జిల్లా విద్యాధికారి దుర్గాప్రసాద్ కొత్తపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు కారంపొడితో భోజనాలు పెట్టిన మధ్యాహ్న భోజన నిర్వహకుల పై ఆగ్రహం వ్యక్తం చెసి వెళ్లిన విషయం అందరికీ తెలిసింది. అనంతరం జిల్లా విద్యాధికారి దుర్గాప్రసాద్ ఆదేశాల మేరకు జిల్లా ఏఎంఓ అధికారి జీవన్ సోమవారం కొత్తపల్లి పాఠశాల సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చెసి విద్యార్థులు తల్లిదండ్రులతో మాట్లాడారు.
విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఏజెన్సీ తొలగించి కొత్తవారిని నియమిస్తామని అన్నారు. ఆయన వెంట కోటగిరి జడ్పీహెచ్ఎస్ హెడ్మాస్టర్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు ఎంఈఓ కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. అయితే దిశ దినపత్రికలో వచ్చిన విద్యార్థులకు కారం వెతుకులే దిక్కు అనే శీర్షికకు సంబంధించిన ఫోటోలను మాజీ మంత్రిలు హరీష్ రావు, కేటీఆర్ లు తమ ట్విట్టర్ ఖాతాలలో ట్విట్ చేయడంతో ఈ వార్త రాష్టంలో సంచలనంగా మారింది.