వీధి కుక్కల దాడిలో 15 గొర్రెలు మృత్యువాత
గొర్రెల మందపై కుక్కలు దాడి చేయగా 15 జీవాలు
దిశ, భిక్కనూరు: గొర్రెల మందపై కుక్కలు దాడి చేయగా 15 జీవాలు( మేక, గొర్రెలు) మృతి చెందిన సంఘటన భిక్కనూరు మండల కేంద్రంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...పాత దళితవాడ సమీపంలోని వ్యవసాయ భూమిలో కోకట్ల రాములు అనే వ్యక్తి మూడు నెలలుగా గొర్ల మందను పెట్టాడు. వారం రోజుల క్రితం కుక్కల దాడిలో 13 జీవాలు మృతి చెందగా, తాజాగా మరో 15 జీవాలు మృతి చెందడంతో గొర్రెల కాపరి రాములు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. సమీపంలో కోళ్ల ఫారాలు ఉండడంతో, చనిపోయిన కోళ్లను తిన్న కుక్కలు, మంద పై దాడి చేస్తూ జీవాలను కరవడంతో మృతి చెందాయన్నారు. సుమారు 2 లక్షల రూపాయల నష్టం ఇప్పటివరకు వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు.