'గ్రామాల అభివృద్ధికి నిధులు ఇవ్వండి'

ఆర్మూర్ నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కోరారు.

Update: 2022-11-23 14:10 GMT

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కోరారు. వారి విన్నపం విన్న మంత్రి సానుకూలంగా స్పందించి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని ఏ గ్రామాల్లో ఏఏ సమస్యలు ఉన్నాయో వాటి పరిష్కారానికి ఎన్ని నిధులు కావాలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు.

హైదరాబాదులోని మంత్రుల నివాసప్రాంగణంలో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో బుధవారం ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు చెడిపోయి అధ్వాన్నంగా ఆయన పరిస్థితులను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టి ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెంట ఆర్మూర్ నియోజకవర్గంలోని సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు ఉన్నారు.

Tags:    

Similar News