నిజామాబాద్ ఇంటర్ పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్

నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్ కొనసాగుతుంది.

Update: 2024-03-05 11:26 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్ కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఎలాంటి మాస్ కాఫీ జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సంబంధిత ఇంటర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ వారి ఆదేశాలు బేఖాతర్ చేస్తూ నిర్లక్ష్యంగా ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల్లో జోరుగా మాస్ కాపీయింగ్ కొనసాగుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి.

    ఇప్పటికే జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారి పరీక్షల కన్నా ముందు నుంచి అన్ని కేంద్రాల్లో పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నప్పటికీ వారి ఆదేశాలను ఏమాత్రం లెక్క చేయని సంబంధిత కళాశాల యాజమాన్యాలు ఇంటర్మీడియట్ ర్యాంకుల కోసం కక్కుర్తి పడి పరీక్ష కేంద్రాల్లో విచ్చలవిడిగా నకలు చిట్టీలు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలైన రెండు కళాశాలలు ఎట్టి పరిస్థితుల్లో తమ కళాశాలలకు ర్యాంకులు రావాలనే దుర్బుద్ధితో ఈ మాస్ కాపీయింగ్ కు తెర లేపుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.

పరీక్ష కేంద్రం నిర్వహిస్తున్న యజమాన్యాల వైఫల్యం : ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు బోడ అనిల్

ఇంటర్ విద్యార్థుల పరీక్షలు కొనసాగుతున్నాయి. విద్యార్థులు డిబార్ కావడానికి పరీక్ష కేంద్రం నిర్వహణ సరిగా లేకపోవడమే. దాంతో విద్యార్థులు మాస్ కాపీయింగ్ చేస్తున్నారు. చెకింగ్ సరిగా ఉంటే మాస్ కాపింగ్ కి తావు ఉండదు.  


Similar News