సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగుల నిరసన

గాంధారి మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రం,కేజీబీవీ సంస్థలో పనిచేస్తున్న సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు గురువారం జిల్లా కేంద్రంలో దీక్ష నిర్వహించారు.

Update: 2024-12-19 11:35 GMT

దిశ , గాంధారి : గాంధారి మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రం,కేజీబీవీ సంస్థలో పనిచేస్తున్న సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు గురువారం జిల్లా కేంద్రంలో దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దీక్షకు దిగారు. అవసరమైతే ఆమరణ దీక్షకు దిగుతామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో యూనియన్ మండల అధ్యక్షుడు గంగా ప్రసాద్, షాహిద్, సాయిలు, రామారావు,రాజు,దీపు, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. 


Similar News