అతిధి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉర్దూ మీడియంలో అతిధి అధ్యాపకులుగా చరిత్ర బోధించుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై వేణుగోపాల్ బుధవారం తెలిపారు.
దిశ, ఆర్మూర్ :ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉర్దూ మీడియంలో అతిధి అధ్యాపకులుగా చరిత్ర బోధించుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై వేణుగోపాల్ బుధవారం తెలిపారు. పీజీ చరిత్రలో ఎంఏ ఉర్దూ మీడియం లో, 55 శాతం మార్కులు సాధించి, నెట్, సెట్ కలిగి ఉండి పీజీ సెట్ పట్టా సాధించిన వారికి ప్రాధాన్యత ఉంటుందని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 20వ తేదీలోపు కళాశాలలో దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ సూచించారు.