ఫార్మా కంపెనీ పరిసరాల్లో గొడవ జరగకుండా భారీ బందోబస్తు

ప్రైవేట్ బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన నేపథ్యంలో ఫార్మా కంపెనీ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించకుండా గురువారం భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.

Update: 2024-12-19 15:05 GMT

దిశ ,భిక్కనూరు :ప్రైవేట్ బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన నేపథ్యంలో ఫార్మా కంపెనీ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించకుండా గురువారం భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. అంతకు ముందు రాత్రి భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామ శివారులోని హైవేపై ప్రైవేట్ బస్సు ఢీకొని గుడ్డెంగారి సిద్ధవ్వ అనే మహిళ దుర్మరణం పాలైన విషయం విధితమే. ప్రమాదానికి కారణమైన ప్రైవేట్ బస్సు ఫార్మా కంపెనీకి చెందినది కావడంతో..పెద్ద ఎత్తున బాధిత కుటుంబ సభ్యులతో పాటు చుట్టుముట్టు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగుతారని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో జిల్లా కేంద్రంలోని పోలీస్ బలగాలతో పాటు, సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల నుంచి సిబ్బందిని రప్పంచి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫార్మా కంపెనీకి వెళ్లే ప్రధాన రూట్లతోపాటు, హైవేపై పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించి హల్ చల్ చేశారు. బాధితురాలి కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించే విషయంలో కామారెడ్డి డీఎస్పీ కార్యాలయం ఆవరణలో ఐదు గంటల పాటు జరిగిన చర్చల్లో సుమారు 6 లక్షల రూపాయల పరిహారం చెల్లించేందుకు ఒప్పుకోవడమే కాకుండా..ఇన్సూరెన్స్ కింద వచ్చే డబ్బులను సైతం బాధిత కుటుంబానికి చెల్లించేందుకు అంగీకరించడంతో బాధిత కుటుంబ సభ్యులు శాంతించారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని సాయంత్రం బస్వాపూర్ గ్రామానికి తీసుకెళ్లడంతో..సుమారు ఐదు గంటల పాటు జరిగిన టెన్షన్ కు తెరపడినట్లు అయ్యింది.


Similar News