పెళ్లి బరాత్​లో డ్యాన్స్ చేయొద్దన్నందుకు వ్యక్తి ఆత్మహత్య

పెళ్లి బరాత్​లో డాన్స్ చేయవద్దని భార్య చెప్పడంతో మనస్థాపానికి గురైన భర్త క్షణికావేశంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Update: 2024-03-29 11:23 GMT

దిశ,నిజాంసాగర్ : పెళ్లి బరాత్​లో డాన్స్ చేయవద్దని భార్య చెప్పడంతో మనస్థాపానికి గురైన భర్త క్షణికావేశంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిజాంసాగర్ మండలంలోని చిన్న ఆరేపల్లి గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై కె.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం నిజాంసాగర్ మండలంలోని చిన్న ఆరేపల్లి గ్రామానికి చెందిన చెన్నబోయిన అనిల్ (28) అనే వ్యక్తి హైదరాబాద్​లో తన భార్య స్వప్న తో కలిసి కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు.

     గురువారం తమ బంధువుల పెళ్లి ఉండడంతో స్వగ్రామానికి వచ్చి వివాహ వేడుకలో పాల్గొన్నారు. అనంతరం వివాహం అనంతరం జరిగే బరాత్ లో అనిల్ భార్య స్వప్న డాన్స్ చేయవద్దు అని చెప్పడంతో మనస్థాపానికి గురైన అనిల్ రాత్రి గ్రామ సమీపంలోని ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య స్వప్న,రెండు సంవత్సరాల కుమారుడు భార్గవ్ ఉన్నారు. మృతుని తండ్రి చెన్నబోయిన లచ్చయ్య ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. 


Similar News