నగరంలో గుంతలు లేకుండా రోడ్లు ఏర్పాటు చేయండి : అర్బన్ ఎమ్మెల్యే

ఇటీవల నగరంలో కురిసిన కొద్దిపాటి వర్షానికి ప్రధాన రోడ్లు గుంతలుగా ఏర్పడి నగర ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు.

Update: 2024-07-09 09:16 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : ఇటీవల నగరంలో కురిసిన కొద్దిపాటి వర్షానికి ప్రధాన రోడ్లు గుంతలుగా ఏర్పడి నగర ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. మంగళవారం ఆర్ అండ్ బి అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. గుంతల మయంగా మారిన రోడ్లన్నీ వెంటనే అధికారులు మరమ్మతులు చేపట్టాలని ఆయన అధికారులకు ఆదేశించారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. వర్షా కాలం దృష్టిలో ఉంచుకొని నిజామాబాద్ నగరంలో గుంతల మయమైన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు.

టీ యూ ఎఫ్ ఐ డీ ఎస్ ఫండ్ లో మిగిలిన పనులు కూడా వెంటనే పూర్తి అయ్యేటట్టు చూడాలని సూచించారు. ఎక్కడైనా కొత్త రోడ్డులు వేసినప్పుడు మంచి క్వాలిటీ తో వేయాలని లేదంటే ఎవ్వరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రోడ్డులు మరమ్మతుల కోసం తవ్విన తర్వాత ఆ గుంతలను వెంటనే పూడ్చి వేయాలన్నారు. నగరంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ లకు రిపేర్ చేయించి లబ్దిదారులకు అందించేలా చూడాలని ఆదేశించారు.

పాత కలెక్టరేట్ గ్రౌండ్ వద్ద ఉన్న స్టలం లో స్పోర్ట్స్ ట్రాక్ ను నిర్మించాలని, ప్రభుత్వ స్థలాల్లో మినీ స్టేడియం నిర్మాణం కోసం సోనీ ఫంక్షన్ హాల్ వద్ద నిర్మించబడుతున్న బ్రిడ్జి పనులు శరవేగంగా పూర్తి చేయాలని అలాగే అర్సపల్లి ఆర్ ఓ బి బ్రిడ్జ్ ను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. సూపరిండెంట్ ఇంజనీర్ గజవాడ హనుమంతరావు , ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మురళి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రవీణ్ , ఏ ఈ లు సాయి కుమార్ , గంగాధర్ , ఉన్నత అధికారులు పాల్గొన్నారు.


Similar News